ఈనెల 8న పశు,మత్స్యదర్శిని మ్యాగజైన్ను సీఎం జగన్ ఆవిష్కరిస్తారని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. అంతేకాకుండా రూ.70 కోట్లతో పుంగనూరు మిషన్ పేరుతో పాడి ఆవుల పిండ మార్పిడి కేంద్రం ఏర్పాటు చేస్తారని అన్నారు. తిరుపతి ఎస్వీ పశువైద్య వర్సిటీని మంత్రి అప్పలరాజు.. ఆ తర్వాత పశువైద్య వర్సిటీ ప్రయోగశాలను పరిశీలించారు.
పశువైద్య రంగంలో నాడు - నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పశువైద్యశాలలను ఆధునికీకరణ చేయనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని తాతయ్యగుంటలో నిర్మించిన ఆధునిక పశువైద్యశాల, పశుగణనక్షేత్ర సముదాయ విభాగాన్ని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
2.3 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో ఆస్పత్రిని నిర్మించామని మంత్రి తెలిపారు. రైతుభరోసా కేంద్రాలలో పశు సంరక్షణ కోసం సహయకులను నియమించామన్నారు. పశు సంరక్షణలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే: మంత్రి అప్పలరాజు