తిరుపతిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరు, తిరుపతి పశ్చిమ రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 155 కిలోల గంజాయి, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. తిరుపతి అర్బన్ పోలీసుల పరిధిలో గంజాయి విక్రయాల పై కఠినచర్యలు తీసుకుంటున్నామని.... పండించిన మొదలు పొట్లాలు కట్టి విక్రయించే ముఠాల వరకు నిఘా పెట్టామని అదనపు ఎస్పీ మునిరామయ్య తెలిపారు.
ఇదీ చదవండీ.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా