తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: TSRTC: 'ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవు'