ETV Bharat / city

11 నుంచి శ్రీవారి దర్శనం..  భక్తులూ ఇవి గమనించండి

నల్లని రూపు చల్లని చూపు...వెరసి... వెలసిన వేలుపు వేంకటేశ్వరుడు80 రోజుల తర్వాత...తెరతీసుకొని కనిపించబోతున్నాడు... సోమవారం నుంచి ఎంపిక చేసిన కొందరికి...ఈనెల 11 నుంచి భక్తజనులందరికీ ఏడుకొండలవాడి దర్శనం లభించబోతోంది!కాకుంటే మునుపటిలా కాదు...కాస్త భిన్నంగా...

tirumala-srivari-darshan-decisions
tirumala-srivari-darshan-decisions
author img

By

Published : Jun 5, 2020, 7:25 PM IST

Updated : Jun 6, 2020, 5:43 AM IST

‘‘తొలి రెండు రోజులు 8, 9 తేదీల్లో కొంతమంది తితిదే సిబ్బందికి ఆలయ ప్రవేశం ఉంటుంది. 10న తిరుమల స్థానికులకు అవకాశం కల్పిస్తాం. ఈ ప్రయోగాత్మక ప్రక్రియను పరిశీలించి 11 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తామ’’ని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌తో కలిసి దర్శనం విధివిధానాలను ఆయన వివరించారు.

11 నుంచి కలియుగ వైకుంఠమూర్తి దర్శన భాగ్యానికి దారిదీ...!

  • ఉదయం 6.30 నుంచి

ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 దాకే దర్శనం! శ్రీవారి మూలమూర్తి దర్శనం మినహా.. వకుళమాత, యోగ నరసింహస్వామి ఉప ఆలయాలకూ అనుమతించరు. ఆర్జిత సేవలకూ భక్తులకు అనుమతి లేదు. శఠారి, తీర్థం, ప్రసాద వితరణా ఉండదు.

  • వీఐపీ పాస్‌లు చెల్లవు

దర్శనానికి ఎవ్వరి సిఫార్సు లేఖలూ చెల్లవు. ప్రొటోకాల్‌ ఉన్న వీఐపీలు వ్యక్తిగతంగా వస్తే వారికి మాత్రమే ఉదయం 6.30 నుంచి 7.30 వరకు బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు.

  • గదికి ఇద్దరే...

ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లతో పాటే అద్దె గదినీ బుక్‌ చేసుకోవచ్చు. ఒక వసతి గృహంలో ఇద్దరికే అనుమతి. 24 గంటలకే పరిమితి. పొడిగింపునకు వీల్లేదు.

  • తలనీలాలు ఇవ్వొచ్చు...

కల్యాణకట్ట ఉదయం 6.30 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుస్తారు. క్షురకులు పీపీఈ కిట్లు ధరిస్తారు.

  • రోజుకు 6వేల టికెట్లు

* రోజుకు 6-7 వేల మందికి దర్శనం ఏర్పాట్లు. 3వేల టికెట్లు (ఒక్కొక్కటి రూ.300) తితిదే వెబ్‌సైట్‌లో అమ్ముతారు. జూన్‌ నెల ఆన్‌లైన్‌ టికెట్ల కోటాను నేడో రేపో విడుదల చేస్తారు.
* మరో 3వేల టికెట్లను కింది తిరుపతిలో కౌంటర్ల ద్వారా (ఈనెల 10 నుంచి) ఇస్తారు. దర్శనానికి ఒకరోజు ముందు వీటిని తీసుకోవాలి. ఇవి ఉచిత టికెట్లు.

  • గంటకు 500

* క్యూ కాంప్లెక్స్‌లోకి గంటకు 500 మందినే అనుమతిస్తారు. భక్తులు భౌతికదూరం పాటించాలి. వేచి ఉండాల్సి వస్తే.. 100 మందిని ఒక హాల్‌లోకి అనుమతిస్తారు.
* హుండీ వద్ద హెర్బల్‌ శానిటైజర్‌ వాడిన తర్వాతే కానుకలు వేయాలి.

  • టిక్కెట్‌ ఉన్నంత మాత్రాన....

ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆన్‌లైన్‌ దర్శనం టికెట్లు నమోదు చేసుకునేముందు ఏపీలోకి వచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పొంది ఉండాలి. స్వామివారి దర్శనం టికెట్లు పొందినంత మాత్రాన రాష్ట్రంలోకి అనుమతి ఉన్నట్లు కాదు. స్పందన పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకుని, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో రావాలి.

  • అక్కడే అన్నప్రసాదం

ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం తెరిచి ఉంటుంది. టేబుల్‌కు ఇద్దరు చొప్పున భోజనం చేయాలి. ఇంకెక్కడా ఉచిత అన్నప్రసాద వితరణ ఉండదు.

  • కొండెక్కాలంటే!

దర్శన టిక్కెట్లు పొందిన భక్తులకు మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు. అలిపిరి నడక మార్గంలో.. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు పంపిస్తారు. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత. రెండు కనుమదారుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి.

  • వీరు రావొద్దు...

65 ఏళ్లకు పైబడిన వారిని, పదేళ్లలోపు పిల్లలను, కంటెయిన్‌మెంట్‌, రెడ్‌జోన్ల నుంచి వచ్చేవారిని దర్శనానికి అనుమతించరు. శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు నిషేధం.

  • అక్కడా పరీక్ష

భక్తులు, సిబ్బందికి అలిపిరి వద్ద ఆరోగ్య పరీక్షలు చేస్తారు. థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు రోజూ 200-300 మందికి ర్యాండమ్‌గా స్వాబ్‌ నమూనాల సేకరణకు అలిపిరి, తిరుమలలో ఏర్పాట్లు చేశారు.

ttd
తితిదే మార్గదర్శకాలివే..!

ఇదీ చూడండి..

వృద్ధులు, పిల్లలు తిరుమల రావొద్దు: వై.వి.సుబ్బారెడ్డి

Last Updated : Jun 6, 2020, 5:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.