TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలను.. ఐఐటీ నిపుణులు పరిశీలించనున్నారు. చెన్నై, దిల్లీకి చెందిన నిపుణుల బృందం వీటిని పరిశీలించనుంది. నిపుణుల నివేదిక మేరకు రహదారికి మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రస్తుతం కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలోనే.. మరో పెద్ద బండరాయి పడేలా ఉండడంతో.. డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారు.
ప్రస్తుతం.. ఎగువ ఘాట్ రోడ్డు మీద విరిగిపడిన రాళ్లను.. జేసీబీలు, క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. నిపుణుల నూచనలతో లింకు రోడ్డు వరకు ఎగువ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించాలనే యోచనలో తితిదే అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల నుంచి అందిస్తారు.
ఇదీ చదవండి...
TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్ మూసివేత