శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుని వాహన సేవలు కన్నులపండుగగా సాగాయి. పెద్దశేష వాహనంతో ప్రారంభమైన వాహనసేవలు అశ్వవాహనంతో ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో రోజుకోక వాహనంపై తిరుమాడవీధుల్లో విహరించిన తిరుమలేశుడు భక్తులను కటాక్షించారు. శ్రావణ నక్షత్రాన అర్చావతారంలో స్వామివారు భూలోకంలో ఆవిర్భవించటం వలన ఈ రోజును ఎంతో పుణ్యదినంగా భావిస్తారు. ఆ కారణంగా కన్యామాసం శ్రవణా నక్షత్రం రోజున అవభృత స్నానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు, చక్రతాళ్వారులను వరహస్వామి ముఖ మండపానికి తీసుకొచ్చి.. అనంతరం ఉభయదేవేరుల శ్రీవారికి, చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పవిత్ర జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. అనంతరం అవభృత స్నానంతో చక్రతాళ్వార్లకు స్వామివారి పుష్కరణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ చక్రస్నానం జరిగిన రోజున పుష్కరణిలో భక్తులు స్నానాలు చేస్తే సకలమైన పాపాలు తొలగి పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
ధ్వజ అవరోహణ
రాత్రి ఏడు గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య నివేదనతో పాటు వివిధ వైదిక కార్యక్రమాల అనంతరం బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ధ్వజస్థంభంపై ఎగురవేసిన ధ్వజపటాన్ని కిందకు దించే ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహిస్తారు.
తొమ్మిది రోజులు... 14 వాహనాలు
తొమ్మిది రోజుల పాటు 14 వాహనాలపై వివిధ రూపాలలో నాలుగు మాడవీధుల్లో విహరించిన శ్రీనివాసుడిని దర్శనం చేసుకొన్న భక్తులు అవభృతస్నానం పర్వదినాన స్వామివారి పుష్కరణిలో స్నానం ఆచరించడానికి భారీగా తరలివస్తారు.
ఇదీ చదవండి :