తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. అక్టోబరుకు సంబంధించి 55 వేల 355 ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 09 వేల 305 సేవా టిక్కెట్లను ఆన్ లైన్ డిప్ విధానానికి కేటాయించారు. డిప్ పద్దతిలో సుప్రభాత సేవ 7 వేల 180.. తోమాలసేవ 110.. అర్చన 110.. అష్టదళ పద్మారాధన 180.. నిజపాద దర్శనం 1, 725 టిక్కెట్లు కేటాయించారు.
సాధారణ పద్ధతిలో 46 వేల 50 టిక్కెట్లను అందుబాటులో ఉంచగా... అందులో విశేషపూజ 1,500.. కల్యాణోత్సవం 10వేల 450.. ఊంజల్‌సేవ 3వేల 300.. వసంతోత్సవం 11 వేల 550... సహస్రదీపాలంకారసేవ 13వేల 200... ఆర్జిత బ్రహ్మోత్సవం 6 వేల 050 టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.
డిప్ పద్దతిలో ఉన్న టిక్కెట్ల నమోదుకు తొమ్మిదవ తారీఖున ఉదయం 10 గంటల వరకు గడువు ఇచ్చారు. నమోదు చేసుకున్న వారికి అదేరోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టిక్కెట్లను కేటాయిస్తారు. ఎంపికైన భక్తులకు సందేశాన్ని పంపిస్తారు. 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి సేవా టిక్కెట్లను పొందేలా అవకాశం కల్పించారు.