ETV Bharat / city

మూడు తరాలుగా ఒకే వైద్యవృత్తి... అమ్మమ్మ, అమ్మ, మనుమరాలిదీ ఒకే బాట - chithore district latest news

ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఒకే రంగంలో నిలదొక్కుకోవడం అరుదుగా చూస్తుంటాం! కొన్ని ఇళ్లలో ఎక్కువమంది ఒకే రంగంలో ఉన్నా వృత్తులూ, బాధ్యతలూ వేర్వేరుగా ఉంటుంటాయి. కానీ ఆ ఇంట్లో ముగ్గురు మహిళలు వారి తరాలను ప్రతిబింబిస్తూ వైద్యవృత్తిలో ప్రవేశించారు! వారి బాధ్యతల్ని ప్రేమిస్తున్నారు! ప్రపంచ కూతుళ్ల దినోత్సవాన ఆ మూడు తరాల మహిళా వైద్యులపై ప్రత్యేక కథనం.

మూడు తరాలుగా ఒకే వైద్యవృత్తి
మూడు తరాలుగా ఒకే వైద్యవృత్తి
author img

By

Published : Sep 26, 2021, 10:05 AM IST

వీరింట్లో ఎవరి తరానికి వారే ప్రతినిధులు. వయసు రీత్యా మూడు తరాలకు ప్రాతినిథ్యం వహించినా వృత్తి మాత్రం ఒకటే. మహిళలు వంటింటికే పరిమితమయ్యే రోజుల్లోనే వైద్యవిద్య అభ్యసించి జిల్లాస్థాయి అధికారిగా సేవలు అందించారొకరు. తల్లి స్పూర్తితో మధుమేహ వ్యాధి నిపుణురాలిగా పేరుగడించారు మరొకరు. అమ్మమ్మ, తల్లి వారసత్వం కొనసాగిస్తూ వైద్య రంగంలో తనకంటూ గుర్తింపు కోసం కృషి చేస్తున్న యువ వైద్యురాలు ఇంకొకరు. చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని వరదయ్యపాళెంలో కె.సరోజ కుటుంబంలో ఉన్నారీ ఆదర్శ మహిళలు.

1965లోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో సరోజ వైద్య విద్య పూర్తిచేశారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సేవలు అందించారు. గ్రామీణ నేపథ్యం ఉన్నా జిల్లాస్థాయి అధికారిగా సేవలు అందించిన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న సరోజ కూతురు కృష్ణ ప్రశాంతి తిరుపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కర్నూలులో ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చదివి వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.

ప్రాథమిక విద్య అభ్యసించే సమయంలోనే అమ్మమ్మతో పాటు ఆస్పత్రికి వెళ్లిన కృష్ణప్రశాంతి కూతురు హర్షిత వైద్యవృత్తిపై మక్కువ పెంచుకున్నారు. వైద్యం సమయంలో అమ్మమ్మ పట్ల రోగులు చూపే గౌరవం తననూ అదే వృత్తి ఎంచుకునేలా చేసిందంటున్నారు. మూడో తరం ప్రతినిధి డాక్టర్‌ హర్షిత. తాను కడుపులో ఉండగా తన తల్లి, కూతురు హర్షిత కడుపులో ఉండగా తాను రోగులకు సేవలందించేవారమని కృష్ణ ప్రశాంతి గుర్తు చేసుకున్నారు.

మూడు తరాలుగా ఒకే వైద్యవృత్తి

ఇదీచదవండి.

SBI ON OVER DRAFT: రూ.6,500 కోట్ల ఓడీకి ససేమిరా..సాధ్యం కాదన్న ఎస్‌బీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.