ETV Bharat / city

Cyber Crime:ఆన్​లైన్​లో చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలు.. ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Aug 24, 2021, 8:09 PM IST

చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు.

SP Venkata Appala Naidu
ఎస్పీ వెంకట అప్పల నాయుడు
ఎస్పీ వెంకట అప్పల నాయుడు

చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్, ఎక్స్ ప్లోటెడ్ చిల్డ్రన్(ఎన్ సీఎమ్ఈసీ) సంస్ధ సీఐడీకి ఫిర్యాదు చేయటంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. సీఐడీ నివేదిక ఆధారంగా తిరుపతిలో దర్యాప్తు చేసి నగరానికి చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేస్తున్న కిషోర్, సాయిశ్రీనివాస్, మునికమల్​ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. అక్రమాలకు పాల్పడిన ముగ్గురు యువకుల పై నిఘా ఉంచామని.. మహిళలు, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. ASSEMBLY SESSIONS: సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.