ETV Bharat / city

TTD: శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల.. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల ఆందోళన

author img

By

Published : Sep 24, 2021, 7:32 AM IST

Updated : Sep 24, 2021, 11:29 AM IST

శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల

07:31 September 24

సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల ఆందోళన

  తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు(Srivari Special entry Tickets release)ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆన్​లైన్​లో విడుదల చేసింది. రూ.300 టికెట్లు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన తితిదే.. అక్టోబ‌ర్‌కు సంబంధించిన కోటా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. తిరుమలకు వచ్చే భక్తులు టీకా 2 డోసులు పూర్తైన సర్టిఫికెట్‌ లేక కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్ తీసుకురావాలని తితిదే అధికారులు స్పష్టం చేశారు.

ఈనెల 25న సర్వదర్శనం టోకెన్లు విడుదల

శనివారం శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు(TTD sarvadarshan tickets) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా తితిదే విడుదల చేయనుంది. అక్టోబ‌ర్‌ 31 వరకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని.. అయితే రోజుకు 8 వేల టికెట్ల మాత్రమే ఇస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. 

సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల ఆందోళన..

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేయడంపై భక్తులు ఆందోళనకు(devotees protest at srinivasam in tirupati) దిగారు. వివిధ ప్రాంతాల నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతి వచ్చిన వాళ్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమిళనాడు, తెలంగాణ నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రోజుకు 8 వేల టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన తితిదే... ఉన్నట్లుండి ఆన్​లైన్​లో జారీ చేస్తామని చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన(devotees protest) చేపట్టారు. దీంతో శ్రీనివాసం వసతిగృహం వద్ద పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి భక్తులను వెనక్కి పంపేందుకు యత్నిస్తున్నారు. 

ఇదీ చదవండి..

MPP ELECTIONS: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు

devotees protest at srinivasam in tirupati

Last Updated : Sep 24, 2021, 11:29 AM IST

For All Latest Updates

TAGGED:

TTD TICKETS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.