ETV Bharat / city

శ్రీవారి భక్తులపై లాఠీఛార్జి జరగలేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో శ్రీవారిమెట్టు వద్ద భక్తులపై లాఠీఛార్జి జరిగిందంటూ వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.

TTD chairman YV subba reddy
TTD chairman YV subba reddy
author img

By

Published : Dec 24, 2020, 1:10 PM IST

మీడియాతో వైవీ సుబ్బారెడ్డి

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఏ విషయాన్నీ వదలడం లేదని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. పక్క రాష్ట్రంలో నివాసముంటున్న ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడి విషయాలు తెలియవని ఎద్దేవా చేశారు.

తిరుపతిలో శ్రీవారి మెట్టు వద్ద భక్తులపై లాఠీఛార్జి జరగలేదని స్పష్టం చేశారు. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అలాంటి ఘటన జరిగిందని తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

'తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలు రద్దు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.