ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకగా ఆలయ ప్రధాన గోపురాలు కనిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయంలో మహద్వార గోపురంతో పాటు... బంగారు తాపడంతో ఆలయ సౌందర్యానికే ప్రతీకగా నిలిచే ఆనంద నిలయ గోపురంపై రావి చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి.
ఆనంద నిలయ గోపురంపై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యఫలమని భక్తుల విశ్వాసం. విమాన వెంకటేశ్వరస్వామికి అలంకరించే వెండి తోరణాలు కళావిహీనంగా మారాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి విభాగానికి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నా... ఎవరూ పట్టించుకోలేదు. ఇలాగే మెుక్కలు పెరిగితే వాటి వేర్ల ద్వారా పగుళ్లు ఏర్పడి గోపురంకు ముప్పువాటిళ్లే ప్రమాదముంది. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి: 'డా. వైఎస్ఆర్ తోటబడి' కార్యక్రమం ప్రారంభం