ETV Bharat / city

ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉంది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉరికొయ్యపై ఉందని తెదేపా సీనియర్​ నేత కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఆదాయం పెరిగినా రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్నారని ఆయన విమర్శించారు.

TDP senior leader Kalva Srinivasulu
తెదేపా సీనియర్​ నేత కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Apr 6, 2021, 2:23 PM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా సీనియర్​ నేత కాలవ శ్రీనివాసులు డిమాండ్​ చేశారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితిపై మేధావులు ప్రజలను చైతన్యపరచాలని ఆయన వేడుకున్నారు. తిరుపతి ఉపఎన్నికలో 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు సృష్టించారని కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

ఇదీ చదవండీ.. జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక మాకు ఎంతో గర్వకారణం: బెజవాడ బార్ అసోసియేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.