ETV Bharat / city

'ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులివ్వటం తప్పుదారి పట్టించడమే' - tirupati stone pelting case

తెదేపా బహిరంగ సభపై రాళ్ల దాడి కేసును పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని తెదేపా నేత నరసింహ యాదవ్ అన్నారు. ఆధారాలు సమర్పించాలంటూ పోలీసులు నోటీసులివ్వటం దారుణమని అన్నారు.

attack on chandrababu
tirupati by poll 2021
author img

By

Published : Apr 16, 2021, 3:45 PM IST

తిరుపతి బహిరంగ సభపై రాళ్ల దాడి కేసులో ఆధారాలు సమర్పించాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నోటీసులు అందుకున్న తెదేపా నాయకులు.. తిరుపతి పశ్చిమ పోలీసు స్టేషన్​కు హాజరయ్యారు. తమ వద్ద ఉన్న ఆధారాలు పోలీసులకు అందజేశామని తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ తెలిపారు.

రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తించకుండా తమనే అధారాలు సమర్పించాలని నోటీసులు ఇవ్వడం కేసును తప్పుదారి పట్టించడంలో భాగమని ఆయన ఆరోపించారు. కోర్టులు సుమోటోగా తీసుకుని కేసును విచారించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.