చిత్తూరు జిల్లాలోని కుప్పం, మదనపల్లె నీటి ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క రూపాయి కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తేదేపా నాయకులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. తిరుపతిలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చిన నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరి మార్చుకొని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...