తిరుపతి ఎస్వీ పశువైద్య వర్శిటీలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ తీరు, ఆక్సిజన్ సరఫరా, బ్లాక్‌ఫంగస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. అధికారులతో మంత్రులు గౌతంరెడ్డి, నారాయణస్వామి, పెద్దిరెడ్డి సమీక్ష జరిపారు.
జిల్లాలో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సరకుల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. జూన్ 1 నుంచి జిల్లాలో ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులోకి వస్తుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
ఆనందయ్య ఔషధంపై ఆయుష్ తుది నివేదిక ఇవ్వలేదని.. నివేదిక వచ్చే వరకు ఔషధంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. నివేదిక వచ్చాక కొవిడ్ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి:
రహస్య ప్రాంతానికి ఆనందయ్య.. మందుపై నివేదికలు వచ్చేవరకు అంతేనా?