తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం గవర్నర్కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి: