చిత్తూరు జిల్లా తిరుపతిలోని మయూర షుగర్ పరిశ్రమ యాజమాన్యం బకాయిలు చెల్లించటం లేదంటూ చెరకు రైతులు ఆందోళన చేపట్టారు. మూడు జిల్లాల రైతులకు రూ.50 కోట్ల మేర యాజమాన్యం బకాయి పడిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతులు.. మయూర చక్కెర కర్మాగారానికి పంట విక్రయించి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదని.. అంతేగాక నకిలీ చెక్కులతో తమను మోసం చేశారని వాపోయారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశ్రమ నుంచి డబ్బులు ఇప్పించాలని చెరకు రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: పుర పోరు: చిత్తూరు జిల్లాలో వైకాపా విజయదుందుభి