ETV Bharat / city

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు: తితిదే ఈవో - తిరుమలలో వైకుంఠ ఏకాదశి తాజా వార్తలు

తితిదే దాతలకు వైకుంఠద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే ఈవో స్పష్టం చేశారు. నెల 25న ఏకాదశి, 26న ద్వాదశి రోజుల్లో పరిమిత దర్శనాలు కల్పిస్తున్నామన్న ఆయన...24న తిరుపతిలోని స్థానికులకే సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామన్నారు.

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
author img

By

Published : Dec 17, 2020, 7:49 PM IST

Updated : Dec 17, 2020, 7:59 PM IST

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 25న ఏకాదశి, 26న ద్వాదశి రోజుల్లో పరిమిత దర్శనాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. 25, 26, జనవరి 1న సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులకు మాత్రమే అనుమతినిస్తామని వెల్లడించారు. ప్రజాప్రతినిధితో కలుపుకొని కుటుంబంలోని ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తామన్నారు. 24న తిరుపతిలో స్థానికులకే సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామన్నారు. తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

వైకుంఠద్వార దర్శనానికి అవకాశం

తితిదే దాతలకు వైకుంఠద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే ఈవో స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశితో పాటు 10 రోజులు తితిదే దాతలకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

స్వర్ణరథం లాగేవారిపై తితిదే ఆంక్షలు

వైకుంఠ ఏకాదశి దృష్ట్యా మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగనున్నారు. స్వర్ణరథం లాగేందుకు వచ్చే వారిపై తితిదే ఆంక్షలు విధించింది. రథం లాగేందుకు వచ్చే మహిళలు, ఉద్యోగులు ఈనెల 23న కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తితిదే ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీచదవండి

అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

Last Updated : Dec 17, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.