ETV Bharat / city

తిరుమలలో శ్రీ భీషణ నృసింహ పూజ‌ - latest news in thirumala

తిరుమలలోని వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ భీషణ నృసింహ పూజ‌ను వేడుకగా నిర్వహించారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా నృసింహ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శాస్త్రోక్తంగా పూజ జ‌రిపారు. శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని నృసింహ అలంకారంలో సింహ వాహ‌నంపై కొలువుదీర్చి.. సుద‌ర్శ‌న చ‌క్రం, నర‌సింహుని ప్ర‌తిమ‌ను ఏర్పాటు చేశారు.

Sri Bhishana Nrusimha Puja
శ్రీ భీషణ నృసింహ పూజ‌
author img

By

Published : May 26, 2021, 8:59 AM IST

తిరుమల వ‌సంత మండ‌పంలో శ్రీ భీషణ నృసింహ పూజ‌ను నిర్వహించారు. చ‌తుర్ద‌శి రోజున సంధ్యా స‌మ‌యంలో న‌ర‌సింహుడు ఆవిర్భ‌వించి దుష్టసంహారం చేసిన‌ట్టు హంపీ క్షేత్రానికి చెందిన శ్రీ గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ వివ‌రించారు. శేషాచ‌ల క్షేత్రంలో తితిదే నిర్వ‌హిస్తున్న ఇలాంటి కార్య‌క్ర‌మాల వ‌ల్ల మాన‌వాళికి శాంతిసౌఖ్యాలు క‌లుగుతాయ‌న్నారు.

కరోనా మహమ్మారిని మానవాళికి దూరం చేయాలని ప్రార్థిస్తూ శ్రీ భీషణ నృసింహ పూజ నిర్వహించినట్టు వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు మోహ‌న‌రంగాచార్యులు తెలిపారు. పూజ‌లో భాగంగా నృసింహ మంత్రాన్ని 108 సార్లు, సుద‌ర్శ‌న మంత్రాన్ని 24 సార్లు పారాయ‌ణం చేసినట్టు చెప్పారు. అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి దంప‌తులు, శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో హ‌రీంద్రనాథ్‌, అర్చ‌కులు, వేద‌పండితులు, వేద‌పారాయ‌ణ‌దారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ… నేటి నుంచి రెండో డోసు కొవాగ్జిన్‌ పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.