ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆరు టన్నుల బియ్యం.. తిరుమల శ్రీవారికి విరాళంగా అందింది. గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో సాగు చేసిన రైతు... 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు విరాళంగా అందించారు. తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శివకుమార్, శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో.. కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు విజయరామ్ ఈ బియాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు.
ఇందులో 25 కిలోల పసుపును తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వినియోగించనున్నారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి బియ్యాన్ని తీసుకుని ఉగ్రాణం ద్వారా ఆలయంలోకి తరలించారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాలను.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ధాన్యంతోనే తయారు చేస్తున్నారు.
ఇదీ చదవండి: