తిరుమల నందకం అతిథి గృహంలో లిఫ్ట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. నందకంలోని అతిథి గృహంలోని లిఫ్ట్‌లో ఆరుగురు భక్తులు కిందికి దిగుతుండగా కరెంట్ పోయింది. దీంతో భక్తులను బయటికి తీసేందుకు లిఫ్ట్ ఆపరేటర్ తలుపులను తెరవగా...ఐదుగురు భక్తులు సురక్షితంగా బయటికి వచ్చేశారు. నెల్లూరు జిల్లా వెంకటిగిరికి చెందిన జయప్రకాశ్ శెట్టి అనే భక్తుడు పొరపాటున కాలి జారి కిందకు పడిపోవటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:
అధికారిక లాంఛనాలతో వీరజవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు