తితిదే పరిధిలోని ఆలయాల్లో భద్రతా వ్యవస్థను పెంచినట్లు ఆలయ ముఖ్య నిఘా భద్రతాధికారి తెలిపారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల కారణంగా నిరంతర భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం సిబ్బందితో పాటు.. సీసీ కెమెరా వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని అన్నారు. తితిదే పరిధిలోని 50 ఆలయాల్లో.. తొమ్మిదింటికి సీసీ కెమెరా వ్యవస్థ లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడుల దృష్ట్యా మిగిలిన ఆలయాల్లోనూ.. ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. అన్ని దేవాలయాలను తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
'పాలన చేతకాకపోతే... దేవదాయశాఖను ఎత్తేసి హిందూ సంఘాలకు అప్పగించండి'