తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి (శాస్త్రీయ నామం ‘మాగ్నోలియా చంపక’)ని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. తితిదే ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. తిరుమలలో సంప్రదాయ ఉద్యాన వనాలను తితిదే అభివృద్ధి చేస్తోంది. ఇందులో.. తిరుమల గురించి వివిధ పురాణాల్లో పేర్కొన్న విధంగా పూల మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ పూజాధికాల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని అలంకరించే దివ్య పుష్పాలలో సంపంగి ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీవారికి ఆలయాన్ని నిర్మించేటప్పుడు సంపంగి వనాన్ని తొలగించవద్దని సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయంగా తొండమాన్ చక్రవర్తికి సూచించాడని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తోంది. నడిమి పడికావిలి గోపురం, మహాద్వార గోపురం మధ్య 30 అడుగుల గోడ నేటికీ సంపంగి ప్రాకారంగా పిలువబడుతోంది.
ఇదీ చదవండి : Pushpayagam: తిరుమలలో వైభవంగా పుష్పయాగం