ETV Bharat / city

కరోనా వల్ల జంతు ప్రదర్శనశాలలకు రూ.8 కోట్ల నష్టం - ఏపీలోని జూ పార్కులపై కొవిడ్ ప్రభావం

కొవిడ్ ప్రభావం జంతు ప్రదర్శనశాలలపై కూాడా పడింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కులను కొవిడ్‌ కోలుకోలేని దెబ్బతీసింది.

Rs 8 crore loss to zoo's due to corona
జూ లపై కరోనా ప్రభావం
author img

By

Published : Dec 6, 2020, 9:26 AM IST

అదీఇదీ అని కాదు.. అన్ని రంగాలూ కరోనా ధాటికి నష్టాల పాలయ్యాయి. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కులను కొవిడ్‌ కోలుకోలేని దెబ్బతీసింది. అన్‌లాక్‌ తర్వాత నవంబరు 16 నుంచి తిరుపతి, 17 నుంచి విశాఖ జూల్లోకి సందర్శకుల్ని అనుమతించినా స్పందన కొరవడింది. గతంతో పోలిస్తే 20 శాతం మందైనా రావడం లేదు. సందర్శకుల ప్రవేశ రుసుముతో పాటు జంతు ప్రదర్శనశాలల్లోని క్యాంటీన్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏటా విశాఖ జూకు రూ.5 కోట్లు, తిరుపతి జూకు రూ.6 కోట్లు సమకూరేవి. కరోనా ప్రభావంతో మొత్తానికే ఆదాయం పడిపోయింది.

పొదుపు నిధులే దిక్కు

కొన్నేళ్లుగా వచ్చిన ఆదాయంలో కొంత మేర జూ నిర్వహణకు వెచ్చించి మిగిలిన మొత్తాలను బ్యాంకులో పొదుపు చేసేవారు. అలా తిరుపతి జూ ఖాతాలో రూ.7 కోట్లు, విశాఖ జూ ఖాతాలో రూ.4.7 కోట్లున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి సందర్శకుల్ని నిలిపివేయడంతో ఆదాయం లేక పొదుపు మొత్తాలే దిక్కయ్యాయి. తిరుపతి అధికారులు రూ.5 కోట్లు, విశాఖ అధికారులు రూ.1.90 కోట్లు డ్రా చేసి, వాటితో జంతువులకు ఆహారం, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు.

విరాళాలు... దత్తత

అధికారులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. తిరుపతి జూ పార్క్‌లో జంతువుల్ని దత్తత ఇవ్వడం ప్రారంభించారు. ఆహారం, మందులకు అయ్యే మొత్తాలను జంతువుల్ని దత్తత తీసుకొన్న వారి నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. తిరుపతి జూకు తితిదే రూ.50 లక్షల్ని విరాళంగా అందించగా, ఎస్‌బీఐ రూ.15 లక్షలు ఇచ్చింది. విశాఖ అధికారులు నిధుల సమీకరణకు బహుళ జాతి సంస్థల్ని సంప్రదిస్తూ సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇక్కడా జంతువుల దత్తతకు చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాదీ విశాఖ జూకు 8 లక్షల మంది, తిరుపతి జూకు 6 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. విశాఖలో ప్రవేశ రుసుం ద్వారా ఏటా రూ.2 కోట్లు సమకూరుతుండగా, తిరుపతి జూలో లయన్‌ సఫారీ, క్యాంటీన్ల అద్దెలు తదితరాలతో రూ.6 కోట్ల ఆదాయం వచ్చేది. మార్చి 28 నుంచి సందర్శకుల రాక నిలిచింది. ఈ 9 నెలల్లో రెండు చోట్లా రూ.8 కోట్ల ఆదాయం తగ్గింది.

ఇదీ చదవండి:

అభివృద్ధి పనులకు గిరిబిడ్డల డీపట్టా భూముల సేకరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.