ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉపాధి నిమిత్తం తిరుపతికి వచ్చి లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వలసకూలీల వెతలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. పూట గడిచేందుకు అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేలా తిరుమల ఎస్వీ ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ముందుకొచ్చింది. 1981-82 బ్యాచ్‌కు చెందిన పూర్వవిద్యార్థులు... బియ్యం, కూరగాయలు, పలు నిత్యావసరాలను వారికి అందించారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహర్ష అందిస్తారు.
ఇదీ చదవండి