చిత్తూరు జిల్లా తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో 12 అడుగుల భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. చుట్టుపక్కల అటవీ ప్రాంతం కావడంతో జీవకోన లోని లింగేశ్వర ఆలయ ప్రాంతంలో కొండచిలువ తచ్చాడుతూ భక్తుల కంట పడింది. కొండచిలువను చూసిన స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు.
ఆలయ పర్యవేక్షకులు తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడుకి దీనిపై సమాచారం అందించారు. భాస్కర్ నాయుడు చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. కాగా.. ఈ కొండచిలువ ఓ కుక్క పిల్లను మింగినట్లు వారు గుర్తించారు.
ఇవీ చదవండి: