చిత్తూరు జిల్లా పుంగనూరు కోనేటిపాళ్యంలో ఉన్న శ్రీ కల్యాణ వెంకటరమణస్వామి వారి ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకువచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో విలీన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళి.. ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను తితిదే అధికారులకు అందజేశారు.
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సముదాయంలో ఈ గుడిని చేర్చినట్లు తితిదే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి...