తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహోత్సవం వేడుకగా సాగింది. స్వామివారు దేవేరులతో కలిసి వైభవోత్సవ మండపం నుంచి బంగారు పల్లకీపై వరాహస్వామివారి ఆలయం వద్దకు వేరు వేరుగా వేంచేశారు. అక్కడ స్వామివారు దేవేరులు ఎదురెదురుగా ఆశీనులను చేసి అర్చకులు ఆళ్వారు దివ్వప్రబంధంలోని పాశురాలను పారాయణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల తరపున అర్చకులు పూల బంతులతో ఆడించారు.
ఈ ఉత్సవాన్ని భక్తులు తిలకించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఆరో రోజున ఆనవాయితీగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు