ETV Bharat / city

తితిదే సిబ్బంది నిజాయితీ.. భక్తురాలి నగదు బ్యాగ్ అప్పగింత - తిరుమల సిబ్బంది

తిరుమలలో అద్దె గదిలో భక్తులు మరిచిపోయిన వస్తువులను తిరిగి వారికి అప్పగించి తితిదే ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. 70 వేల రూపాయల నగదుతో పాటు విలువైన వస్తువులున్న బ్యాగ్​ను తిరిగి అందుకున్న భక్తులు.. సిబ్బందికి కృతజ్ఙతలు తెలిపారు.

pilgrim  bag handed over by ttd staff
రూపాయలు 70వేల నగదు బ్యాగ్​ అప్పగించిన తితిదే సిబ్బంది
author img

By

Published : Dec 21, 2020, 7:10 PM IST

తిరుమలలోని అద్దె గదిలో భక్తులు మరిచిపోయిన వస్తువులను తిరిగి వారికి అప్పగించి తితిదే ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సతీష్‌ దంపతులు వకుళామాత అతిథి గృహంలో గది తీసుకున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకుని గది ఖాళీ చేసి తిరుగు పయనమయ్యారు. అనంతరం గదిని పరిశీలించేందుకు వెళ్లిన తితిదే సిబ్బందికి ఆ గదిలో బ్యాగ్‌ కనపడింది.

గుర్తించిన సిబ్బంది.. గదిని పొందేందుకు ఇచ్చిన వివరాల ఆధారంగా వారికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వసతికల్పన విభాగం డిప్యూటీ ఈవో దామోదరం ఆధ్వర్యంలో భక్తులను పిలిపించి బ్యాగ్ అప్పగించారు. అందులో విలువైన వస్తువులతో పాటు.. రూపాయలు 70వేల నగదు ఉన్నట్లు వారు తెలిపారు. పోగోట్టుకున్నామనుకున్న వస్తువులను తిరిగి అప్పగించినందుకు తితిదే సిబ్బందికి భక్తులు కృతజ్ఙతలు తెలిపారు.

ఇదీ చదవండి:

శ్రీవారిని దర్శించుకున్న మైసూరు​ శ్రీ పరకమణి మఠం పీఠాధిపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.