ఆక్సిజన్ ఆందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రుయా ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారని.. కర్నూలు, హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు.
ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిచుకోలేదని నిందించారు. విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నాని...మరక్కడా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.
ఇదీచదవండి
ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం