రాష్ట్ర సమస్యలపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఏనాడైనా మాట్లాడారా? అంటూ తిరుపతిలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రశ్నించారు. వైకాపా ఎంపీలు మాట్లాడకపోగా తెదేపా ఎంపీలు మాట్లాడితే అడ్డుకొంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని భాజపా ప్రభుత్వం గడ్డిపోచకన్నా హీనంగా చూస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన పనులు నేటికీ అలానే ఉన్నాయన్నారు. ఎక్కడ చూసినా అసంపూర్తి పనులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
తిరుపతిలో గరుడవారధి, గూడూరు ఫ్లైఓవర్, నడికుడి రైల్వే లైను అన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా ప్రజా సంక్షేమం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే తిరుపతి పవిత్రత కాపాడేలా కృషిచేస్తానని పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: దేశంలో మరోసారి లక్ష దాటిన కరోనా కేసులు