తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి వైకాపా అభ్యర్థి 60 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. గురుమూర్తికి 1,47,094 ఓట్లు, తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798, భాజపా అభ్యర్థి రత్నప్రభకు 12,530 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 25 రౌండ్లలో ఫలితాలు వెలవడనున్నాయి. నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలోని 7 హళ్లలో, తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 10 హాళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నలుగురు పరిశీలకుల కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: