ప్రముఖ కవి, రచయిత శంకరంబాడి సుందరాచారి ప్రత్యక్ష శిష్యుడు... శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ మన్నవ భాస్కర నాయుడు (84) సోమవారం మధ్యాహ్నం తిరుపతిలో తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడిగా, కథారచయితగా, పద్యకావ్య రచయితగా పేరుపొందిన ఆయన.. ఎందరో ప్రముఖులను గురువుగా తీర్చిదిద్దారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పీఠం సత్కారం, పులికంటి పీఠం తదితర పురస్కారాలను అందుకున్నారు. స్వేద సూర్యోదయం, ముత్యాల సరాలు, రామాయణం పద్య కావ్యాలు, చెక్ పోస్ట్ నాటిక , అరటి ఆకు కథ లాంటి ఆయన రచనలు ప్రసిద్ధి చెందాయి. ఇంకా అనేక హరికథలు , బుర్రకథలు , కవితలు ప్రచురించారు. తిరుపతి, కడప, విజయవాడ, చెన్నై రేడియో కేంద్రాల ద్వారా ప్రసంగాలు చేసేవారు.
భాస్కర నాయుడి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు.. గోవింద ధామంలో జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి