ETV Bharat / city

TMC Mayor On National Kabaddi: తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

TMC Mayor On National Kabaddi: తిరుపతి నగరంలో జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష తెలిపారు.

author img

By

Published : Dec 28, 2021, 7:35 PM IST

TMC Mayor On National Kabaddi
తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

TMC Mayor On National Kabaddi: తిరుపతి నగరంలో జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కబడ్డీ మనందరి పండుగని ఆమె అన్నారు. జాతీయస్థాయిలో కబడ్డీ క్రీడలు నిర్వహించడం మనందరికి గర్వకారణం అని శిరీష తెలిపారు. 22 రాష్ట్రాల నుంచి 40 పురుష, స్త్రీ జట్లు పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. కబడ్డీ పోటీల నిర్వహణలో భాగంగా రేపు ఉదయం ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠానా నుంచి ఇందిరా మైదానం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రజలందరూ భాగస్వాములు కావాలని మేయర్ కోరారు.

ఇదీ చదవండి : CPI Ramakrishna on YCP Govt. : నియంత్రించాల్సింది నిత్యావసరాల ధరలు..సినిమా టిక్కెట్ల ధరలు కాదు. -రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.