ఎన్నికలకు ముందు ముస్లింలకు అనేక హామీలిచ్చిన వైకాపా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ గాలికి వదిలేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తిరుపతిలో ముస్లింలతో కలిసి నెలవంక చూసి.. పవిత్ర రంజాన్ మాసానికి ఆయన స్వాగతం పలికారు. ఇమాం, మౌజన్లకు ప్రస్తుతం గౌరవ వేతనం రావడంలేదని, రంజాన్ తోఫా ఆపేశారని విమర్శించారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ కోసం ఖైదీల నిరాహార దీక్ష
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు షాదీఖానాల నిర్మాణానికి నిధులివ్వడంతో పాటు.. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలిచ్చామని లోకేష్ గుర్తు చేశారు. వైకాపా పాలనలో ఒక్కరికైనా రుణాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ముస్లింల సంక్షేమం కోసం నిధులను విడుదల చేయటంలో తెదేపా ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులతో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సలాం ఘటనపై శాసనమండలిలో పోరాటం చేసి.. సీబీఐ విచారణ కోసం పట్టుపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
'గురుమూర్తి అభ్యర్థిత్వంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం'