ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల ఆందోళన - West Godavari District Latest News

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పురపాలక సంఘం కార్మికులు నిరసన బాట పట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. పలుమార్లు సమస్యలను తెలిపినా పట్టించుకోకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Breaking News
author img

By

Published : Dec 3, 2020, 6:25 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలంటూ... చిత్తూరు జిల్లా పుత్తూరు పురపాలక సంఘం కార్మికులు ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. శాశ్వత ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని అందులో ప్రస్తవించారు. ఆప్కాస్ ఏజెన్సీని రద్దు చేయాలని, కార్మికులందరికి ఆరోగ్య కార్డులు అమలు చేయాలని కోరారు.

ఏలూరులో..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట పురపాలక సంఘం కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాఠశాల స్వీపర్లు, ఇంజినీరింగ్ విభాగం కార్మికులకు మూడునెలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. పబ్లిక్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట..

శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల హెల్త్ ఎలవెన్సులతో పాటు బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఆరు నెలలుగా హెల్త్ అలవెన్స్ చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేశామని మున్సిపల్ శాఖ మంత్రి ప్రకటించినా ఇంకా వేతనాలు ఇవ్వడం లేదని సీఐటీయూ నాయకులు విమర్శించారు.

ఇదీ చదవండి:

రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.