MP Tejasvi Surya On Kishkinda: హనుమంతుడి జన్మస్థలం గురించి ఎంపీ తేజస్వీ సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమంతుని జన్మస్థలం కర్ణాటకలోని అంజనాద్రి సమీపంలో గల కిష్కిందే అనడంలో సందేహం లేదని తెలిపారు. కిష్కింద కర్ణాటకలోని హంపికి సమీపంలోని కొప్పళ జిల్లా అంజనాద్రిలో ఉందని వివరించారు.
భాజపా తలపెట్టిన భారత దర్శన్ యాత్రలో భాగంగా తేజస్వీ ఆదివారం అంజనాద్రి ఆలయాన్ని సందర్శించారు. భారతదేశం అంతటా పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామాయణంతో ముడిపడి ఉన్న వేలాది ప్రదేశాలను తాను చూశానని, అందుకే దేన్నీ కాదనలేమని ఆయన అన్నారు.
వాల్మీకి పేర్కొన్న కిష్కిందకు, ప్రస్తుతం కర్ణాటకలోని కిష్కిందకి చాలా పోలికలు ఉన్నాయన్నారు. హనుమంతుని జన్మస్థలం కర్ణాటకలోని అంజనాద్రి అని ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు.
హనుమంతుడి జన్మస్థలం వివాదం: హనుమంతుడి జన్మస్థలం విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం, కర్ణాటకలోని శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మధ్య వివాదం వివాదం నడుస్తోంది. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగినా గతేడాది ప్రతిష్టంభనతో ముగిసింది.
ఇదీ చదవండి : ABV Rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీకి సర్కార్ షోకాజ్ నోటీసు