ETV Bharat / city

TTD board: 'ప్రత్యేక ఆహ్వానితులు భక్తులకు ఎలాంటి సహకారాలు అందిస్తారు..?'

తితిదే ధర్మకర్తల మండలిపై ప్రభుత్వం పునరాలోచించాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సూచించారు. తితిదే ఛైర్మన్‌ సహా 25 మంది సభ్యులుంటే వారికి అదనంగా మరో యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రత్యేక ఆహ్వానితులు భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారని ప్రశ్నించారు.

mp gvl narasimharao
mp gvl narasimharao
author img

By

Published : Sep 16, 2021, 9:03 PM IST

భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు

తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్యను ఎన్నడూ లేనివిధంగా పెంచడం సరికాదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తితిదే ఛైర్మన్‌ సహా 25 మంది సభ్యులుంటే వారికి అదనంగా మరో యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రత్యేక ఆహ్వానితులు భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ అధికార రాజకీయాలకు, పదవుల పందేరాలకు వేదికగా వైకాపా ప్రభుత్వం భావిస్తోందని దుయ్యబట్టారు. ఈ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. పుణ్యక్షేత్రంగా.. తిరుమల విశిష్టత గుర్తించి ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు మానేసి, హిందువులపై ఆంక్షలు మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. లేదంటే భాజపా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని జీవీఎల్‌ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.