అభివృద్ధే అజెండాగా తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైకాపా, తెదేపాతో తలపడతామని భాజపా స్పష్టం చేసింది. జనసేనతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు.. తిరుపతిలో తర్వాత ఏం సాధిస్తారో చెప్పడం మాని, ఇప్పటి వరకూ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సాగర్‌మాల పథకం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటు లాంటి కేంద్రం నిధులతో తిరుపతిలో చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!