మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతిలో భేటీ అయ్యారు. నిండ్ర ఎంపీపీ ఎన్నికపై మంత్రితో మాట్లాడారు. ఎంపీటీసీలు పార్టీ విప్ ధిక్కరించారని మంత్రికి వివరించారు. రెండోసారి విప్ జారీ చేసినా ఎంపీటీసీలు పాటించలేదని చెప్పారు. పార్టీ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని రోజా కోరారు.
నిండ్రలో జరిగిన పరిణామాలు బాధాకరం. గెలిచిన తరువాత గ్రూప్ రాజకీయాలు చేయడం సీఎం జగన్‌ను, ఆయన పార్టీని, ఆయన ఇచ్చిన బీ-ఫామ్‌ను ధిక్కరించినట్లు అవుతుంది. ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... దిగమింగుకుని పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని కాదని... కో ఆప్షన్ మెంబర్ కోసం రోడ్డు మీద ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం. ఎమ్మెల్యేను, పార్టీ కోసం కష్టపడిన నాయకులందరినీ దూషిస్తూ... ఇతర పార్టీల సహకారంతో ధర్నాలు చేసిన వారిని వైకాపా నుంచి సస్పెండ్ చేయాలి. -రోజా, నగరి ఎమ్మెల్యే
ఏం జరిగిందంటే...
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వైకాపాలో ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలాకాలంగా ఉన్న విభేదాలతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో నిండ్రలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక కోసం రోజా, చక్రపాణిరెడ్డి వర్గాలు పోటీ పడ్డాయి. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో రిటర్నింగ్ అధికారి కంటతడిపెట్టారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అధికారులను బెదిరించారు. ఎంపీపీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి చక్రపాణిరెడ్డి మద్దతు ప్రకటించారు. వైకాపా నేతల తీరు పట్ల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య నిండ్ర ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
ఇదీచదవండి.
దిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం.. హాజరైన హోంమంత్రి సుచరిత..