ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతిలో పర్యటించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ఆయన తిరిగారు. నగరాన్ని మత్తురహిత ప్రదేశంగా మార్చే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అశోక్‌నగర్, రైల్వే కాలనీల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న కొంతమంది వ్యక్తులను ఎమ్మెల్యే వెంబడించి పట్టుకుని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హరిశ్చంద్ర శ్మశాన వాటికలోనూ తనిఖీలు చేశారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల బారినపడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే కోరారు.
నగరంలోని రాయల చెరువు గేటు రైల్వే అండర్ బ్రిడ్జి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నగర మేయర్ శిరీష, కమిషనర్ గిరీషాతో కలిసి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆగస్టు రెండో వారం నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారన్నారు. రైల్వే పనులు పూర్తైన వెంటనే నగర పాలక సంస్థ ద్వారా చేపట్టాల్సిన నిర్మాణ పనులను ఇరవై ముప్పై రోజుల్లో ముగిస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రాయల చెరువు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: Tirumal: నేటినుంచి.. మూడు రోజుల పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం