తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు బండపై జరుగుతున్న వకుళామాత ఆలయ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి .. అక్కడ జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా వకుళమాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అరణ్య చిత్రాన్ని వీక్షించాలి'