ETV Bharat / city

minister peddi reddy visiting : వరద ప్రభావిత ప్రాంతాల్లో.. మంత్రి పెద్ది రెడ్డి పర్యటన - వరద ప్రభావిత ప్రాంతాలు

పూతలపట్టు మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. చిట్టిపి రాళ్ల, పూతలపట్టు గ్రామాల పరిధిలో వరదలో కొట్టుకుపోయిన(floods affected areas) కల్వర్టులు రోడ్లను పరిశీలించారు.

మంత్రి పెద్ది రెడ్డి
మంత్రి పెద్ది రెడ్డి
author img

By

Published : Nov 22, 2021, 5:48 PM IST

Updated : Nov 22, 2021, 6:56 PM IST

చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పెద్ది రెడ్డి పర్యటన

చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను (flood affected areas chittoor district) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై కొట్టుకుపోయిన స్వర్ణముఖి కాజ్​వేను మంత్రి పరిశీలించారు. వరదల వల్ల ఎదురైన నష్టాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన కాజ్​ వేకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టి, సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పక్కనే ఉన్న నక్కల వాగును పరిశీలించారు. గండిపడిన రాయల చెరువును మంత్రి పరిశీలించారు.

పూతలపట్టు మండలంలోనూ మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. చిట్టిపి రాళ్ల, పూతలపట్టు గ్రామాల పరిధిలో వరదలో కొట్టుకుపోయిన కల్వర్టులు, రోడ్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమయంలో ఆయన వెంట ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, అధికారులు ఉన్నారు.

కాగా.. తిరుపతిలో వర్షాలు తగ్గినా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఇంకా పలు కాలనీలు జలదిగ్బందంలోనే ఉన్నాయి. నగరంలోని ఆటోనగర్, శ్రీకృష్ణనగర్, గాయత్రీ నగర్, ఎమ్మార్​ పల్లి, సరస్వతీ నగర్, గాంధీపురం, లింగేశ్వర కాలనీలల్లో ఇళ్లలోకి వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువులు నిండిపోవడంతో తిరుపతి నగరంలోనికి వరద పోటెత్తింది. నాలుగు రోజుల నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నామని, నీటిని మళ్ళించే ప్రయత్నం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Floods in Tirupati: తిరుపతికి తప్పని వరద.. ముంపులోనే పలు కాలనీలు

Last Updated : Nov 22, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.