లాక్డౌన్ సమయంలో నాటుసారా, బార్లలో మద్యం బయట అమ్మకాలు జరిగితే.. వాటిని అదుపుచేయటంలో ఎక్సైజ్ శాఖ విఫలమైనట్లేనని ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మరింత కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచినట్లవుతుందన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల డీసీలు, ఇసీలు, డీఎంలతో తిరుపతి నుంచి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అధికారులు తప్పులు చేస్తే సస్పెండ్ చేయటం ఒక్కటే పరిష్కారం కాదని, తొలగించడం, శాఖపరమైన చర్యలు చేపట్టాలన్నారు. నాటు సారా, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్మడం చేస్తున్నారన్న మంత్రి... ఈ అమ్మకాలు తిరుపతితో సహా గుంటూరు, నెల్లూరు, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాలలో ఎక్కువగా ఉందన్నారు. జిల్లా ఎస్పీలు రెవెన్యూశాఖ, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో దాడులు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి : పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం