యువత ప్రత్యేకంగా కనబడేందుకు ఆసక్తి చూపుతుంటారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓ భక్తుడు ఒంటినిండా బంగారు గొలుసులు ధరించి.. యాత్రికుల్లో ప్రత్యేకంగా కనబడ్డాడు. లావాటి బంగారు ఆభరణాలను మెడలో వేసుకుని.. చేతికి కడియాలు తొడిగి కనపడిన హైదరాబాద్‌కు చెందిన.. రాహుల్ అనే యువకుడిని చూసేందుకు యాత్రికులు ఆసక్తి కనబరిచారు. కొందరు భక్తులు అది నిజమైన బంగారమేనా అంటుంటే... మరి కొందరు రెండు కేజీల బంగారం వేసుకున్నాడని చర్చించుకున్నారు.
ఇదీ చదవండి: పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయడమేంటి?: చినరాజప్ప