కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి పొందాలని, దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు మరింత శక్తిని ప్రసాదించాలని.... శ్రీవారిని ప్రార్థించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు. ఆలయంలో చౌహన్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజన మండపంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో సతీ సమేతంగా పాల్గొని... స్వామివారిని మధ్యప్రదేశ్ సీఎం ప్రార్థించారు.
తిరుమలేశుడిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనాపై బలంగా పోరాడుతున్నాం. దేశరక్షణ కోసం సరిహద్దులో చైనాపై మన సైనికులు గట్టి జవాబు ఇచ్చారు. మోదీ నాయకత్వంలో అన్నింటిలో భారత్ విజయం సాధించనుంది.
- శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం
ఇదీ చదవండి: పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్