తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత ఎంపీ దుర్గాప్రసాద్‌కు నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం దుర్గాప్రసాద్ ఎంతో కృషిచేశారని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజాసేవ చేశారన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సభ్యులందరూ మౌనం పాటించారు. అనంతరం సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : అధికారిక లాంఛనాలతో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు