ETV Bharat / city

శ్రీవారి కార్యక్రమాలపై లాక్‌డౌన్‌ ప్రభావం

author img

By

Published : Mar 23, 2020, 6:06 PM IST

కరోనా ప్రభావంతో ఇప్పటికే శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన తితిదే.... తదుపరి నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరుపుతోంది. వైదికంగా ఏటా ఉగాదికి తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం జరుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీటిని ఎలా నిర్వహించాలనే విషయంపై తితిదే ఆగమ సలహా మండలితో సమావేశానికి పిలుపునిచ్చింది.

ttd
ttd
శ్రీవారి కార్యక్రమాలపై లాక్‌డౌన్‌ ప్రభావం

కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించటంతో తదుపరి కార్యాచరణపై తిరుమల తిరుపతి దేవస్థానం సమాలోచనలు సాగిస్తోంది. వరుసగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం కార్యక్రమాలు వైదికంగా నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వేదపండితులు, తితిదే ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి చర్యలపై దృష్టి సారించనుంది. ఈ కార్యక్రమాల నిర్వహణపైన తితిదే ఆగమ సలహా మండలితో సమావేశానికి పిలుపునిచ్చింది. స్వామివారి దర్శనాల నిలిపివేత పొడిగింపు దిశగా ఆలోచిస్తున్న తితిదే..... ఇవాళ సమావేశంలో ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి: కరోనాకు మరో 1,014 మంది బలి- ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.