కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను కర్నూలు టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆఫీసుకు చెందిన ఆర్ఐ రవికుమార్ కర్నూలు జిల్లా తోళ్ల మడుగు గ్రామం సమీపంలోని అడవుల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. చీనీతోట నుంచి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురిని అధికారులు పట్టుకున్నారు. వీరు అదేప్రాంతానికి చెందిన తలారి రమేష్ (25), వి. కేశవులు (36), జి. బాబ్జీ (43), ఎం. పాల్ (25) గా గుర్తించారు. నిందితులు ఎర్రచందనం దుంగలను చీనీ తోటలో దాచి, తమిళ స్మగ్లర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిందని డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్... 12 దుంగలు స్వాధీనం - తిరుపతి తాజా సమాచారం
ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను కర్నూలు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 12 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.